Corona Alert : నేటి నుంచీ హైదరాబాద్‌లో కరోనా వైద్య పరీక్షలు - AsianFlick

Trending

Wikipedia

Search results

Post Top Ad

Monday, 3 February 2020

Corona Alert : నేటి నుంచీ హైదరాబాద్‌లో కరోనా వైద్య పరీక్షలు

Corona Alert : కరోనా వైరస్ వల్ల ఇప్పటివరకూ 350 మంది చనిపోయారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్‌లోనే కరోనా వైద్య పరీక్షల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

Corona Virus Alert : ఇప్పటివరకూ ఇండియాలో ఎవరిలోనైనా కరోనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే... ఆ వ్యక్తి శాంపిల్స్‌ను పుణెలోని వైరస్ టెస్ట్ కేంద్రానికి పంపేవారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ అనుమతితో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలోనే కరోనా వైరస్ టెస్టులు చేస్తున్నారు. ఇవాళ్టి నుంచే ఇవి అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ఎవరికైనా దగ్గు, తుమ్ములు కంటిన్యూగా 10 నిమిషాలకు మించి ఉంటే... ముక్కు కారుతూ ఉంటే, జ్వరంతోపాటూ ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపిస్తూ ఉంటే... అలాంటి వారు వెంటనే గాంధీ ఆస్పత్రికి వెళ్లడం మంచిదే. అక్కడ ప్రత్యేక విడిగా ఏర్పాటు చేసిన కేంద్రంలో ప్రత్యేక కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరుపుతారు. ఆ పరీక్షల్లో నెగెటిఫ్ రిజల్ట్స్ వస్తే... వ్యాధి సోకనట్లే. అదే పాజిటివ్ రిజల్స్ వస్తే... వ్యాధి సోకినట్లే. ఫలితాల్లో కరోనా వ్యాధి సోకినట్లు తెలిస్తే... వెంటనే ఆ వ్యక్తిని ప్రత్యేక కేంద్రంలో ఉంచి... రెగ్యులర్‌గా జ్వరాలు, జలుబు, దగ్గు తగ్గేందుకు ఇచ్చే మందులు ఇస్తూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి ఇంకెవరినీ కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం పంపిన కిట్లను ఇస్తారు. అలాగే ఎప్పటికప్పుడు ఆ వ్యక్తిని డాక్టర్లు పర్యవేక్షిస్తూ ఉంటారు. లక్కీగా అతనికి వైరస్ తగ్గిపోతే... డిశ్చార్జి చేస్తారు. అలా కాకుండా వ్యాధి ముదురుతూ పోతే ప్రాణాలకే ప్రమాదం. వైరస్‌‌పై ఏవైనా డౌట్లు ఉంటే అడిగేందుకు 24 గంటల కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశారు. 040–24651119కు ఫోన్ చేసి డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు.

ఇప్పటివరకూ కరోనా వైరస్‌కి మందు కనిపెట్టలేదు. ఎన్ని పరీక్షలు చేస్తున్నా ఆ మొండి వైరస్ లొంగట్లేదు. అసలు దాన్ని ఎలా వదిలించుకోవాలో డాక్టర్లకు అర్థం కావట్లేదు. అటు చూస్తే మృతుల సంఖ్య పెరిగిపోతోంది. ఆదివారం ఒక్కరోజే చైనాలో అదనంగా 56 మంది చనిపోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 350కి చేరింది. దీనిపై ప్రపంచ దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 14వేల మందికిపైగా సోకడంతో... అంతర్జాతీయ ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రపంచ దేశాలన్నీ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని మళ్లీ మళ్లీ కోరుతోంది.

ఇక చైనాను ప్రపంచ దేశాలు ఒంటరిని చేసినట్లైంది. కావాలని చెయ్యకపోయినా... పరిస్థితుల వల్ల తప్పట్లేదు. ఇప్పుడు చైనా నుంచీ దిగుమతులను అన్ని దేశాలూ ఆపేస్తున్నాయి. అలాగే... ఆ దేశానికి ఎగుమతులు కూడా తగ్గించేస్తున్నాయి. అక్కడ ఉండే తమ ప్రజలందర్నీ వెనక్కి పిలిపించేసుకుంటున్నాయి. సమస్యేంటంటే... ప్రపంచంలో దిగ్గజ కంపెనీలన్నీ చైనాలో తమ ఉత్పాదక కేంద్రాల్ని ఏర్పాటు చేసుకున్నాయి. తమ దేశంలో కంటే చైనాలో వస్తు తయారీ ఖర్చు తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, మొబైల్ కంపెనీలు, ఆటో ఇండస్ట్రీ ఇలా ఎన్నో చైనాలో కేంద్రాల్ని పెట్టి... అక్కడే వస్తువుల్ని తయారుచేయిస్తున్నాయి. ఇప్పుడు ఆ కంపెనీలు... చైనాలో ఉత్పత్తి నిలిపివేయాలనుకుంటున్నాయి. చైనాతో ఎలాంటి సంబంధాలూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనంతటికీ కారణం ఈ దరిద్రపు కరోనా వైరస్సే.ఇండియాలో ఇప్పటికే ఇద్దరికి కరోనా వైరస్ సోకినట్లు స్పష్టం కావడంతో... అన్ని రాష్ట్రాలూ అప్రమత్తమై ప్రత్యేక వైద్య పరీక్షలకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఐతే... మన అదృష్టం కొద్దీ ఇండియాలో ఎండాకాలం మొదలవుతోంది. ఇప్పటికే వాతావరణం వేడెక్కింది. ఇలా వాతావరణంలో హీట్ పెరిగేకొద్దీ ఇలాంటి వైరస్‌లు చనిపోతుంటాయి. అందువల్ల ఈసారి మనకు ఎండాకాలం త్వరగా రావడం మంచిదే అనుకోవచ్చు. ఫలితంగా ఇండియాలో ఈ వైరస్ పెరగకుండా చనిపోయే అవకాశాలుంటాయి.

No comments:

Post a Comment

Post Top Ad