1. ఆధార్ కార్డు సేవల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన మొబైల్ అప్లికేషన్ mAadhaar. ఇటీవల ఈ యాప్‌ను అప్డేట్ కూడా చేశారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త వర్షన్ రిలీజైంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. గతంలో మీరు mAadhaar యాప్ ఉపయోగిస్తున్నట్టైతే గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 10.0 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారికి కొత్త ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది. యూజర్లు పాత యాప్ డిలిట్ చేసి కొత్త యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఎంఆధార్ యాప్‌ను 13 భాషల్లో ఉపయోగించొచ్చు. అందులో 12 భారతీయ భాషలు కాగా, మరో భాష ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, మళయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ భాషల్లో ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది. ఇంగ్లీష్‌లో టైప్ చేస్తేనే ఇతర భాషల్లో కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. పర్సనలైజ్డ్ ఆధార్ సర్వీసెస్ పొందేందుకు ఆధార్ ప్రొఫైల్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ ఉన్నవారు మాత్రమే కాదు... లేనివాళ్లు కూడా తమ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ ఇన్స్టాల్ చేయొచ్చు. ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే 'Main Service Dashboard', 'Request Status Services', 'My Aadhaar' లాంటి సేవలుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. రీప్రింట్, అడ్రస్ అప్డేట్, ఇకేవైసీ డౌన్లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ / ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి. మొత్తం 35 రకాల సేవలు ఒకే యాప్‌లో పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వెరిఫై చేయొచ్చు. మీరు మర్చిపోయిన ఆధార్ నెంబర్, ఎన్రోల్మెంట్ ఐడీని తిరిగి పొందొచ్చు. ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఎంఆధార్ యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎంఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు. 'My Aadhaar' సెక్షన్లో పర్సనలైజ్డ్ సెక్షన్ ఉంటుంది. ఒక ఆధార్ యాప్‌లో ఒకరి వివరాలు మాత్రమే కాదు... మూడు ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఎంఆధార్ యాప్‌లో లొకేట్ ఎన్రోల్మెంట్ సెంటర్ చేయొచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవలు కూడా పొందొచ్చు. ఎంఆధార్ యాప్ ఆఫ్‌లైన్‌లో పనిచేయదు. ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తుంది. ఆధార్ కార్డ్ హోల్డర్లు ఎంఆధార్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్, ఇకేవైసీ షేర్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇక ఇందులో మరో కీలకమైన ఫీచర్ ఏంటంటే... రైల్వే ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణించేప్పుడు ఐడీ ప్రూఫ్‌ను ఎంఆధార్ యాప్ ద్వారా చూపించొచ్చు. ఎయిర్‌పోర్టులో కూడా ఎంఆధార్ యాప్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా చూపించొచ్చు. యాప్ ఉంటే సాఫ్ట్ కాపీని మీ ఫోన్లోనే క్యారీ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
No comments:
Post a Comment