Coronavirus alert | చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ ఇప్పటి వరకు 25 దేశాలకు వ్యాపించింది. భారత్‌లోనూ రెండు కేసులు నిర్ధారణకాగా...పదుల సంఖ్యలో రోగులు కరోనా వైరస్ లక్షణాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
చైనాలో పుట్టిన ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బుసలుకొడుతోంది. చైనాతో పాటు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. కరోనా వైరస్ బారినపడి ఇప్పటి వరకు చైనాలో 307 మంది మృత్యువాతపడ్డారు. మరో 14 వేల మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇప్పటికే ఈ వైరస్ చైనాతో పాటు మరో 25 దేశాలకు వ్యాపించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటు భారత్‌లో ఆదివారం కరోనా వైరస్ రెండో కేసు నిర్ధారణ అయ్యింది. రెండో కేసు కూడా కేరళలోనే నిర్థారణ కావడం కలకలంరేపుతోంది. దేశ వ్యాప్తంగా పదుల సంఖ్యలో ఈ వైరస్ లక్షణాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ ప్యాపించకుండా కేంద్రం, అన్ని రాష్ట్రాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి.
అటు కరోనా వైరస్ తొలి కేసు నమోదైన చైనాలోని వుహాన్ నగరం నుంచి 647 మంది యువ ఇంజనీర్లు, విద్యార్థులు, ఉద్యోగులను ప్రత్యేక ఎయిరిండియా విమానాల్లో భారత్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ వ్యాపించకుండా కట్టడి చేసేందుకు భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా పర్యాటకులతో పాటు ఆ దేశంలో నివాసముంటున్న విదేశీయులకు ఆన్‌లైన్ వీసా వసతిని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వస్తున్నట్లు బీజింగ్‌లోని భారత దౌత్యకార్యాలయం తెలిపింది.

ఏదైనా కారణంతో తప్పనిసరిగా భారత్‌లో పర్యటించాలనుకునే వారు...బీజింగ్లోని భారత దౌత్యకార్యాలయం లేదా షాంఘై, గ్వాంగ్జౌ నగరాల్లోని భారత కాన్సులేట్లను కానీ..భారత వీసా దరఖాస్తు కేంద్రాలను గానీ సంప్రదింవచ్చని సూచించింది.
No comments:
Post a Comment