టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్.. వణికిపోతున్న దర్శక నిర్మాతలు.. - AsianFlick

Trending

Wikipedia

Search results

Post Top Ad

Sunday, 2 February 2020

టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్.. వణికిపోతున్న దర్శక నిర్మాతలు..

Coronavirus: అదేంటి.. ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. తెలుగు ఇండస్ట్రీపై కూడా పడటం జరుగుతుందా..? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? దేన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.

అదేంటి.. ఎక్కడో చైనాలో ఉన్న జబ్బు మన ఇండియాకు రావడం.. తెలుగు ఇండస్ట్రీపై కూడా పడటం జరుగుతుందా..? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా..? దేన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇప్పటికే ఇండియాలో కూడా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. దాంతో మనవాళ్లు కూడా భయంతో వణికిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటికి వస్తుంటే మాస్క్ లేకుండా రాలేకపోతున్నారు. ఇక ఇప్పుడు ఈ ప్రభావం టాలీవుడ్‌పై కూడా పడుతుందనే ప్రచారం అయితే జోరుగా జరుగుతుంది. తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు.. హీరోలు మాట్లాడితే ఫారెన్ టూర్స్ వెళ్తుంటారు.
Corona Alert: టాలీవుడ్‌ను కూడా వణికిస్తున్న కరోనా వైరస్
Corona Alert: టాలీవుడ్‌ను కూడా వణికిస్తున్న కరోనా వైరస్

కొందరు రెగ్యులర్‌గా ఏదో పక్కూరికి వెళ్లొచ్చినట్లు బ్యాంకాక్, థాయ్ ల్యాండ్ లాంటి దేశాలు తిరిగేసి వస్తుంటారు. అక్కడ లొకేషన్స్ ఎంచుకుంటారు. దాంతో పాటే పర్సనల్ టూర్స్ కూడా వేస్తుంటారు. ఇలాంటి వాళ్లంతా ఇప్పుడు అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. ఊ అంటే స్క్రిప్టు రాసుకోడానికి బ్యాంకాక్ లాంటి దేశాలకు వెళ్లే పూరీ జగన్నాథ్ కూడా ఇప్పుడు గోవాతో సరిపెట్టుకుంటున్నాడని తెలుస్తుంది. ఇక థాయ్‌ల్యాండ్ అడవుల్లో తన తర్వాతి సినిమా షూటింగ్ ప్లాన్ చేసిన సుకుమార్ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.

Corona Alert: టాలీవుడ్‌ను కూడా వణికిస్తున్న కరోనా వైరస్
Corona Alert: టాలీవుడ్‌ను కూడా వణికిస్తున్న కరోనా వైరస్

ముందు ఈ చిత్రాన్ని శేషాచలం అడవుల్లో షూట్ చేయాలనుకున్నాడు సుకుమార్. అయితే అక్కడ క్రూర మృగాలుంటాయని అనుమతి నిరాకరించారు అధికారులు. దాంతో థాయ్‌ల్యాండ్ ప్లాన్ చేసాడు. కానీ కరోనా కల్లోలం చూసి సుకుమార్ కూడా ఓ అడుగు వెనకేస్తున్నాడని.. మరో ప్లేస్ చూసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇక డెస్టినేషన్ ట్రిప్స్ ప్లాన్ చేసుకున్న టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలు కూడా వేసుకున్న టికెట్స్ క్యాన్సిల్ చేసుకుని హాయిగా ఇంట్లోనే ఉంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా కరోనా కలకలం ముందు టాలీవుడ్ కూడా తలొంచుతుంది.

No comments:

Post a Comment

Post Top Ad