టాలీవుడ్లో కొంతమంది హీరోలు..ఒక వైపు యాక్టింగ్ చేస్తూనే...ఇంకోవైపు నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిలో కొందరు బయటి హీరోలతో సినిమాలను తెరకెక్కించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతగా రంగంలోకి దిగబోతున్నాడు. అంతేకాదు తన బ్యానర్‌కు తన కొడుకు, తండ్రి కలిసొచ్చేలా భార్గవ్ హరి ప్రొడక్షన్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. ఈ రకంగా హీరో నుంచి నిర్మాతలుగా మారిన తెలుగు హీరోలెరున్నారో ఓ లుక్కేద్దాం.
ఎన్టీఆర్,రామ్ చరణ్
తన తండ్రి చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’తో నిర్మాతగా మారాడు రామ్ చరణ్. ఇపుడు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. (Twitter/Photos)
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా నిర్మాతగా రంగంలోకి దిగబోతున్నాడు. అంతేకాదు తన బ్యానర్‌కు తన కొడుకు, తండ్రి కలిసొచ్చేలా భార్గవ్ హరి ప్రొడక్షన్ అని పెట్టబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)
గతంలో బాలకృష్ణ ‘బాల గోపాలుడు’,‘ప్రాణానికి ప్రాణం’,సుల్తాన్’,‘నిప్పురవ్వ’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు. కానీ ఫస్ట్ టైమ్ పూర్తి స్థాయి నిర్మాతగా మాత్రం తన తండ్రి జీవిత చరిత్రపై తెరకెక్కించిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’, ‘ఎన్టీఆర్ మహానాయకుడు’సినిమాతో మారాడు. ఈసినిమాకు నిర్మాతగా తన పేరుతో పాటు భార్య వసుంధరా దేవి పేరును కూడా స్క్రీన్ పై వేసుకున్నారు. (ట్విట్టర్ ఫోటో)
చిరంజీవి తమ్ముడు నాగబాబు అంజనా ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ‘రుద్రవీణ’ ‘త్రినేత్రుడు’ సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. (Instagram/Photo)
హీరోగానే కాకుండా నిర్మాతగా మన్మథుడు 2., మన్మథుడు సహా పలు విజయవంతమైన ఎన్నో చిత్రాలను నిర్మించిన నాగార్జున. (Soruce: Twitter)
పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ‘ఛల్ మోహన్ రంగా’ వంటి సినిమాలను నిర్మించిన పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
మహేష్ బాబు MB G.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ‘శ్రీమంతుడు’‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరించాడు (పైల్ ఫోటో)
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన మోహన్ బాబు (Twitter/photo)
రాజశేఖర్ కూడా తన కూతుళ్లైన శివానీ,శివాత్మిక పతాకంపై పలు సినిమాలను తెరకెక్కించారు. (Source: Facebook)
రాజేంద్రప్రసాద్ కూడా పూర్తి స్థాయి నిర్మాతగా కాకపోయినా.. ‘టామీ’ వంటి కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించాడు (file photo)
దివంగత శ్రీహరి కూడా శశాంక్, మేఘాంశ్ బ్యానర్‌పై కొన్ని పృథ్వీ నారాయణ వంటి కొన్ని సినిమాలను తెరకెక్కించారు. (twitter/Photo)
తండ్రి బాటలోనే నిర్మాతగా పలు సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన మంచు విష్ణు (Twitter/Photo)
ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ‘అతనొక్కడే’‘జై లవకుశ’ వంటి హిట్ సినిమాలను నిర్మించిన కళ్యాణ్ రామ్ (Twitter/photo)
నాని కూడా ‘డీ ఫర్ దోపిడి’ మరియు ‘అ’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు (ఫైల్ ఫోటో)
రానా కూడా ‘బొమ్మలాట’, ‘కేరాఫ్ కంచర్లపాలెం’ వంటి సినిమాలకు సమర్ఫకుడిగా నిర్మాతగా వ్యవహరించాడు. (Image:RanaDaggubati/Instagram)
విజయ్ దేవరకొండ కూడా ‘నోటా’ సినిమా కోసం నిర్మాత అవతారం ఎత్తాడు. తన ప్రొడక్షన్ హౌస్‌కు తన పేరును ఇంగ్లీష్‌లో వచ్చేటట్టు కింగ్ ఆఫ్ హిల్ అంటూ స్టార్ట్ చేసాడు. (instagram/Photo)
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ‘అఖిల్’ సహ కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు నితిన్ (twtter/photo)
వరుణ్ తేజ్ కూడా తన చెల్లెలు నిహారిక హీరోయిన్గా నటించిన ‘సూర్యకాంతం’ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించాడు.(Twitter/Photo)
‘నిను వీడని నీడను నేనే’ సినిమాతో నిర్మాత అవతారం ఎత్తిన సందీప్ కిషన్..ఈ మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అంతకు ముందు ‘డీ ఫర్ దోపిడి’సినిమాను నానితో కలిసి నిర్మించారు. (Twitter/Photo)
సుధీర్ బాబు కూడా సుధీర్ బాబు ప్రొడక్షన్స్ పతాకంపై ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో నిర్మాతగా సక్సెస్ అందుకున్నాడు. (Twitter/Photo)
హరికృష్ణ కూడా తన తండ్రి ఎన్టీఆర్‌తో పాటు తమ్ముడు బాలకృష్ణతో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ట్రాక్ రికార్డ్ ఉంది. (ఫైల్ ఫోటో)
సీనియర్ ఎన్టీఆర్ కూడా NAT బ్యానర్‌తో పాటు రామకృష్ణ సినీ స్టూడియోస్ పతాకంపై పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. (ఫైల్ ఫోటో)
అక్కినేని నాగేశ్వర రావు కూడా అన్పపూర్ణ పిక్చర్ బ్యానర్లో దుక్కిపాటి మధుసూదనరావు, ఆదుర్తి సుబ్బారావలతో సంయుక్తంగా పలు చిత్రాలను నిర్మించారు. ఆ తర్వాత దర్శకుడు ఆదుర్తితో కలిసి చక్రవర్తి చిత్ర పతాకంపై సినిమాలను ప్రొడ్యూస్ చేసాడు. ఆ తర్వాత సోలోగా అన్నపూర్ణ స్టూడియో పతాకంపై ఎన్నో హిట్ సినిమాలను నిర్మించారు. (twitter/Source)
సూపర్ స్టార్ కృష్ణ కూడా సోదరులతో కలిసి పద్మాలయ స్టూడియో బ్యానర్లో పలు సక్సెస్ఫుల్ సినిమాలను నిర్మించాడు. మరోవైపు రెండో భార్య విజయ నిర్మలతో కలిసి విజయకృష్ణ బ్యానర్లో పలు హిట్ సినిమాలను నిర్మించారు కృష్ణ (Twitter Image)
కృష్ణంరాజు కూడా తన సోదరుడు ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుతో కలిసి గోపికృష్ణ బ్యానర్లో పలు హిట్ సినిమాలను నిర్మించారు. (Twitter / Photo)
శోభన్‌బాబు పూర్తి స్థాయి నిర్మాతగా సినిమాలు నిర్మించక పోయినా.. ‘దేవాలయం’ వంటి కొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. (ఫేస్బుక్ ఫోటో)
ఒకప్పటి జానపద కథానాయకుడు కాంతారావు కూడా సొంతంగా సినిమాలను నిర్మించి డబ్బులు పోగుట్టుకున్నారు. (యూట్యూబ్ క్రెడిట్)
No comments:
Post a Comment